Tuesday, 31 May 2011
Sunday, 29 May 2011
Friday, 27 May 2011
Thursday, 26 May 2011
కార్తీక్ ఆదిత్య అన్నప్రాసన
ఈ రోజు కార్తీక్ ఆదిత్య అన్నప్రాసన.
వీడు నిన్న పొద్దున్న బోర్ల పాడడం నేర్చుకొని సాయంత్రం కాళ్ళ పాకడం నేర్చేసుకున్నాడు బోర్ల పడడానికి అయిన ఆలస్యాన్ని ఇలా పాకడం ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేసి, అన్నప్రాసన రోజుకి పాకకపోతే ఎలాగ అన్న అమ్మ దిగులు పోగొట్టాడు (గొర్రె పిల్ల పట్టుకోకముందు).
వీడు పుట్టి ఆరు నెలల ఆరు రోజులు అయింది ఈ రోజుకు. ఈ రోజు సాయంత్రం 4 మరియు 5 గంటల మద్యలోమామయ్య అత్తయ్య వాళ్ళతో కలిసి Thronton Heath ( లండన్) మహా గణపతి గుడి లో అన్నప్రాసన జరిపించాము.
గుడి లో పాలతో కలిపిన బెల్లం బియ్యం పాయసం తయారు చేశారు. ఉంగరం తో నేను, బిందు, మామయ్య అత్తయ్య ఒక్కొక్కరు మూడు సార్లు పాయసం పెట్టాము.
తరువాత వాడిని బోర్ల పడుకోబెట్టి వాడి ముందర పుస్తకాలు, car keys , చాకు, గొర్రె పిల్ల బొమ్మ, pen , ఉంచారు. వాడు గొర్రె పిల్ల బొమ్మ మరియు car keys ఒకేసారి తీసుకున్నాడు. తరువాత పుస్తకాలు పట్టుకున్నాడు. యింక నల్లరాళ్ల తిమ్మాపురం లో ట్రాక్టర్ తో వ్యవసాయం మరియు గొర్రెల పెంపకం guarantee అని కొంతమది భయపడ్డారు(?)
Wednesday, 25 May 2011
ఈ రోజు కార్తిక్ బోర్ల తిరిగాడు
ఈ రోజు కార్తిక్ బోర్ల తిరిగాడు
మూడు నెలల దాటినప్పటినుంచి ఎదురుచూసి ఇంక వీడు బోర్ల తిరగడు ఇంక ఒకేసారి లేచి కూర్చోవడమే అని అంతా ఫిక్స్ అయిన తరువాత ఈ రోజు తిరిగాడు.
మూడు రోజలనుంచి బెడ్ మీద పడుకున్నప్పుడు పాడడం ప్రాక్టీసు చేసి ఈ రోజు పోద్దునకి సాధించాడు.
ఇంక రోజంతా అదే పని. సాయంత్రానికి ఎడమ వైపు కుడి వైపు తిరగడం వచ్చింది.
ఇప్పుడు అలా కింద పడుకోబెడితే ఇలా బోర్ల తిరుగుతున్నాడు.
ఇంతకుముందే కొంచెం పైకి లేవడం వచ్చింది కాబట్టి, బోర్ల తిరిగినప్పుడు చేయి పక్కకు తీసుకోవడం సులభం అయ్యింది .
Tuesday, 24 May 2011
Monday, 23 May 2011
Subscribe to:
Posts (Atom)